సముద్రంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్

by Ajay Maddhiboyina |

అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్రంలో పైలెట్ హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

సముద్రంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్రంలో పైలెట్ హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో శ్రీ విజయపురం నుండి హెలికాప్టర్ అండమాన్ జిల్లాలోని మాయాబందర్ కు బయలుదేరింది. అయితే సుమారు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ పవన్ హన్స్ అప్రమత్తం అయ్యారు. హెలికాప్టర్‌ను అత్యవసరంగా సముద్రంలో ల్యాండింగ్ చేశారు. అంతే కాకుండా ల్యాండింగ్ చేసే ముందే రెస్క్యూ సిబ్బందికి పైలెట్ సమాచారం ఇచ్చారు.

దీంతో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయానికి అక్కడకు బోట్లలో చేరుకున్న రెస్క్యూ బృందాలు నీటిలో ప‌డిన వెంట‌నే ప్ర‌యాణికుల‌ను, పైలెట్ ను ర‌క్షించాయి. హెలికాప్ట‌ర్ లో మొత్తం ఏడుగురు ఉండ‌గా వారిలో ఐదుగురు ప్ర‌యాణికులు, ఇద్ద‌రు సిబ్బంది ఉన్నారు. ప్ర‌యాణికుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. ర‌క్షించిన‌వారిని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌యాణికుల‌కు, సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వ‌లేద‌ని అధికారులు నిర్ధారించారు. పైలెట్ చాక‌చ‌క్యంగా ల్యాండింగ్ చేయ‌డంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Next Story