నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్‌ జామ్‌.. తిండి తిప్పల్లేక నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు

by Gantepaka Srikanth |

ట్రాఫిక్‌(Traffic)లో చిక్కుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు, మూడు నిమిషాలకే అల్లాడిపోతుంటారు.

నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్‌ జామ్‌.. తిండి తిప్పల్లేక నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్‌(Traffic)లో చిక్కుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు, మూడు నిమిషాలకే అల్లాడిపోతుంటారు. ఐదు, పది నిమిషాలైతే కోపం తన్నుకు వస్తుందనడంలో సందేహం లేదు. అలాంటి ఏకంగా వారంతా నాలుగు రోజులుగా ట్రాఫిక్‌(Heavy Traffic)లో చిక్కుకున్నారు. రోడ్లపైనే పడిగాపులు కాస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని ఔరంగాబాద్ - రోహ్‌తాస్ మద్యలో భారీ వర్షానికి వరదనీరు హైవేను ముంచెత్తింది. దీంతో 65 కిలోమీటర్ల మేర ఢిల్లీ - కోల్‌కతా హైవేపై(Delhi-Kolkata Highway) భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అధికారుల సమన్వయ లోపంతో వాహనాలు హైవే పైకి వచ్చి మరింత ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యాయి. నాలుగు రోజులుగా ట్రాఫిక్‌లోనే చిక్కుకుని ఆహారం, నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ట్రాఫిక్ జామ్ వల్ల వ్యాపారాలకూ భారీ నష్టం వాటిల్లుతోందని.. అంబులెన్సులు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు కూడా ఈ భారీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాయని పేర్కొంటున్నారు. వీడియో

Next Story