- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌లో భారీ వర్షాలు.. 200 మంది మృతి
పాకిస్తాన్(Pakistan)లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్(Pakistan)లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కూరుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా జూన్ చివరి నుండి జులై వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలు పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్-బాల్టిస్తాన్‌లలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు పాక్ లో 203 మంది మరణించగా, పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. అలాగే 23,800 ఇళ్లు ధ్వంసం కాగా, 3,500 కిలోమీటర్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో వంతెనలు తెగిపోగా, వేలాది ఎకరాల పంట నీటి మునిగింది.
కేవలం ఈ రెండు నెలల్లో కురిసిన వర్షాలకు దేశవ్యాప్తంగా దాదాపు రూ.3 వేల కోట్ల నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పులు, గ్లేసియర్ కరిగే వేగం, పెరగడమే కాకుండా ఇండియన్ ఓషన్ ఉష్ణోగ్రతలు 1°C పెరగడం వల్ల మాన్సూన్ వర్షాలు 190% అధికంగా కురవడంతో పాక్ లో ఈ పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్ ప్రభుత్వం, సహాయక కార్యక్రమాలు చేపట్టింది.






