భారీ వర్షాలు.. బురదలో కూరుకుపోయిన వాహనాలు

by Naga Rani Yarlagadda |

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

భారీ వర్షాలు.. బురదలో కూరుకుపోయిన వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా మండి (Mandi) జిల్లాలో పడిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు ధ్వంసమవ్వగా.. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో ముగ్గురు మరణించగా.. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు వివరించారు.

మండి జిల్లా కేంద్రంలో గల జైల్ రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్, సైంజ్ రీజియన్ తదితర ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో అడిషినల్ కలెక్టర్, మండి డిప్యూటీ కమిషనర్, ఉన్నతాధికారులు పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడటంతో.. పఠాన్ కోట్ - మండి జాతీయ రహదారి, కిరాత్పూర్ - మనాలి నాలుగు లేన్ల రహదారి, చండీగఢ్ - మనాలి హైవేలను మూసివేశారు.

Next Story