ఎడారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. రైలు పట్టాలపైకి వరద నీరు

by Naga Rani Yarlagadda |

ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమవ్వగా.. కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఎడారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. రైలు పట్టాలపైకి వరద నీరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమవ్వగా.. కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపైకి భారీగా వరదనీరు చేరడంతో.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జైపూర్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి.

సవాయి మాధోపూర్ జిల్లాను మధ్యప్రదేశ్ లోని షియోపూర్ కు అనుసంధానించే నేషనల్ హైవే 552 భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోట జిల్లాలోని ఎటావా సమీపంలో పార్వతి నది ఉప్పొంగడంతో రాజస్థాన్ - మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. నేషనల్ హైవే 70 (కోట-గ్వాలియర్-షియోపూర్ రోడ్డు)పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

వాతావరణ శాఖ కోట, బరాన్, ఝలావర్, చిత్తోర్‌గఢ్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయగా, బికనీర్, చురు, శ్రీ గంగానగర్ వంటి ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. వాతావరణ హెచ్చరికల దృష్ట్యా బుధవారం 15 జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి.

Next Story