Harvard: హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల నిలిపివేత.. ట్రంప్ కీలక నిర్ణయం

by vinod kumar |
Harvard: హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల నిలిపివేత.. ట్రంప్ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తమ దేశంలోని హార్వర్డ్ యూనివర్సిటీ (Harward University) కి షాక్ ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేశారు. అంతేగాక దానికి సంబంధించిన 60 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులను సైతం రద్దు చేశారు. క్యాంపస్‌లో యూదు వ్యతిరేకతను అరికట్టాలని అందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక అడ్మిషన్లు, నియామక పద్దతుల్లో మార్పులు చేయాలని, ఫేస్ మాస్కులను నిషేధించాలని లేఖ రాసింది. అయితే ఈ డిమాండ్లను హార్వర్డ్ అధికారులు తిరస్కరించారు. హార్వర్డ్ అధ్యక్షురాలు అలాన్ గార్బర్ స్పందిస్తూ ఈ డిమాండ్లు విశ్వవిద్యాలయం హక్కులను ఉల్లంఘించడమే గాక జాతి, రంగు ఆధారంగా వివక్షతను నిరోధించే అధికారాన్ని అణచివేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిధులను నిలిపివేస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది.

ఈ నిర్ణయం పట్ల హార్వర్డ్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ట్రంప్ పరిపాలనా విభాగం పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, బ్రౌన్, ప్రిన్ స్టన్ వంటి ప్రధాన సంస్థలకు కూడా నిధులు ఆపివేసింది. గాజా యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలలో పెరుగుతున్న యూదు వ్యతిరేకతను ఈ సంస్థలు విస్మరించాయని ఆరోపించింది.



Next Story

Most Viewed