Harshwardhan: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ మార్పు

by B.Srinivas |

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణలో భాగంగా పలు కీలక మార్పులు చేసింది.

Harshwardhan: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ మార్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ(Congress party) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణలో భాగంగా పలు కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా హర్షవర్ధన్ సప్కల్‌ (Harshwardhan sapkal) ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (Kc Venugopal) గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. గతేడాది చివరలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం నానా పటోలే పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించిన పార్టీ తాజాగా సప్కల్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడేట్టివార్‌ను అపాయింట్ చేసింది. కాగా, హర్షవర్ధన్ సప్కల్ 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్రలోని బుల్ధానా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్నారు. అంతేగాక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆయన సన్నిహితుడిగా పేరుగాంచారు.

Next Story