- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'హిండెన్ బర్గ్'పై కఠిన చర్యలు తప్పవు! కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
by Geesa Chandu |
హిండెన్ బర్గ్, కాంగ్రెస్ తో కలిసి దేశం పరువు తీసిందని కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: హిండెన్ బర్గ్, కాంగ్రెస్ తో కలిసి దేశం పరువు తీసిందని కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదానీ గ్రూప్ పై కూడా హిండెన్ బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గిరిరాజ్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు జై రామ్ రమేష్ లను తీవ్రంగా విమర్శించారు. అసలు హిండెన్ బర్గ్ వెనక ఉన్నదే కాంగ్రెస్ అని విమర్శించారు. కాగా హిండెన్ బర్గ్, సెబీ డైరెక్టర్ మాధవి పురి బచ్ పై రిపోర్ట్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని, ఆమెపై దర్యాప్తు జరిపేందుకు జేపీసీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Next Story






