Hamas: మరో ఆరుగురికి విముక్తి కల్పించేందుకు రెడీ అయిన హమాస్

by Shamantha N |

గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్, ఇజ్రాయెల్(Israel-Hamas) మధ్య ఖైదీల విడుదల క్రమంగా జరుగుతోంది.

Hamas: మరో ఆరుగురికి విముక్తి కల్పించేందుకు రెడీ అయిన హమాస్
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్, ఇజ్రాయెల్(Israel-Hamas) మధ్య ఖైదీల విడుదల క్రమంగా జరుగుతోంది. హమాస్‌ తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులను విడతల వారిగా విడుదల చేస్తోంది. కాగా.. ఇప్పుడు మరో ఆరుగురికి విముక్తి కల్పించేందుకు సిద్ధమైంది. అయితే, అందులో భాగంగానే ఇప్పడు మరో ముగ్గురిని విడుదల చేసింది. దీంతో, ఇప్పటివరకు శనివారం విడుదల చేస్తామన్న ఆరుగురిలో ఐదుగురిని రెడ్ క్రాస్ కు అప్పగించింది. మరొకరిని త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. మరోవైపు.. ఇటీవల హమాస్‌ పంపించిన ఒక మృతదేహంపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

మహిళ మృతదేహంపై..

షిరి బిబాస్‌ అనే మహిళ, తన ఇద్దరు చిన్నారులు హమాస్‌ చెరలో ఇన్నాళ్లూ బందీగా ఉన్నారు. అయితే, యుద్ధం వల్ల మహిళతో పాటు చిన్నారులు కూడా మృతి చెందారు. ఇటీవలే ఆమె మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు పంపించారు. అయితే, అది అసలు తమ దేశ పౌరురాలిది కాదని.. ఫోరెన్సిక్‌ అధికారులు ధృవీకరించారని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఆ డెడ్ బాడీ పాలస్తీనాకు చెందిన మహిళ శవంగా గుర్తించినట్లు పేర్కొంది. జరిగిన తప్పిదానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. కాగా.. దీనిపైనే హమాస్ స్పందించింది. బందీలు ఉన్న ప్రాంతంపై ఐడీఎఫ్‌ దాడులు చేయడంతో చనిపోయిన వారి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయని తెలిపింది.దీనిపైన మరోసారి సమీక్ష జరుపుతామంది. కాగా.. ఈ పరిణామాల మధ్యే షిరి బిబాస్ కుటుంబం స్పందిస్తూ.. ఆ డెడ్ బాడీ ఆమెదే అని వెల్లడించడం గమనార్హం.

Next Story