- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
H1B Visa: లక్ష మంది భారతీయ యువతకు హెచ్4 వీసా టెన్షన్.. కారణమిదే?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా అక్రమ వలసదారులపై మాత్రం తీవ్రంగా వ్యవహరిస్తు్న్నారు. ఇప్పటికే వేలాది మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ను గుర్తించి స్వదేశాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వీసా గడువు ముగిసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని ట్రంప్ పాలకవర్గం హెచ్చరిస్తోంది. దీంతో హెచ్1బీ వీసా అంశం భారతీయ యువతను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే హెచ్1బీ వీసా ఉన్న తమ తల్లి దండ్రులతో పాటు హెచ్4 వీసాల కింద మైనర్లుగా అమెరికాకు వచ్చిన వేలాది మంది భారతీయ యువకులు ఇప్పుడు 21ఏళ్ల వయస్సుకు చేరుకుంటున్నారు. దీంతో వారి ఇమ్మిగ్రేషన్ స్థితి ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం వారు ఇకపై వారి H-1B వీసా ఉన్న తల్లిదండ్రులపై ఆధారపడి ఉండలేరు. అయితే గతంలో వయస్సు ముగిసిన తర్వాత కొత్త వీసాను ఎంపిక చేసుకోవడానికి రెండేళ్ల సమయం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ట్రంప్ ఆ చాన్స్ ఇవ్వకపోవచ్చని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల సుమారు లక్ష మంది భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. వారంతా బహిష్కరణకు గురయ్యే చాన్స్ ఉందని, లేదంటే అమెరికాలో బయటి వ్యక్తులుగా జీవించే పరిస్థితి రావొచ్చని ఆందోళన చెందుతున్నారు.
1.34లక్షల మందిపై ప్రభావం!
2023 మార్చి డేటా ప్రకారం హెచ్ 4 వీసా కింద అమెరికాకు వచ్చిన వారి భారతీయుల సంఖ్య సుమారు 1.34లక్షలుగా ఉంది. ప్రస్తుతం వీరంతా 21 ఏళ్ల వయసుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ వయసుకు చేరుకోగానే వీసా గడువు ముగుస్తుంది. అనంతరం వారు వారి తల్లిదండ్రులపై ఆదారపడి యూఎస్‌లో ఉండటానికి అనర్హులు అవుతారు. అయితే సరైన పత్రాలు లేని వసలదారులకు వీసా గడువు ముగిసిన తర్వాత డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్ (డీఏసీఏ) ప్రకారం.. రెండేళ్ల తాత్కాలిక రక్షణ ఉంటుంది. ఈలోపు వారు మరొక వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం యూఎస్ ఆ అవకాశం లేకుండా చేసే వీలు కల్పిస్తోంది. ఎందుకంటే టెక్సాస్ కోర్టు డీఏసీఏ ప్రకారం కొత్త దరఖాస్తులను నిషేధించింది. దీంతో భారతీయ యువత ఆందోళనకు గురవుతున్నారు. వారు దేశాన్ని విడిచి రావొచ్చని దీంతో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే చాన్స్ ఉందని తెలుపుతున్నారు.
హెచ్4 వీసా అంటే?
హెచ్4 వీసాను హెచ్1బీ వీసా కింద అమెరికాకు వెళ్లే పిల్లలకు ఇస్తారు. ఈ వీసాతో 21 ఏళ్లు వచ్చే వరకు పిల్లలు తమ పేరెంట్స్‌తో కలిసి యూఎస్‌లో ఉండొచ్చు. ఆ తర్వాత వీసా రద్దవుతుంది. అయితే తన వీసాను F-1 (స్టూడెంట్ వీసా)గా మార్చుకోవడానికి అర్హులు అయినప్పటికీ ఈ ప్రక్రియలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే హెచ్4 గడువు ముగిసాక కెనడా, యూకేకు వెళ్లాలని పలువురు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, 2026 ఆర్థిక సంవత్సరానికి ఇమ్మిగ్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను యూఎస్ ప్రారంభించింది. ఈ ప్రక్రియ మార్చి 7 నుంచి 24 వరకు కొనసాగుతుంది.






