- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో హెచ్3ఎన్2తో మహిళ మృతి
by S Gopi |
గుజరాత్‌లో ఇన్‌ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ సోకి ఓ మహిళ మరణించింది. వడోదరా ఎస్‌ఎస్‌జీ... Gujarat reports first death from H3N2 influenza virus, 7th in India

X
గాంధీనగర్: గుజరాత్‌లో ఇన్‌ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ సోకి ఓ మహిళ మరణించింది. వడోదరా ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న 58 మహిళ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఈ వైరస్‌తో మరణించినవారి సంఖ్య ఏడుకు చేరింది. మొదటి మరణం కర్ణాటకలో హసన్ జిల్లాలో సంభవించిన సంగతి తెలిసిందే. జనవరి నుంచి మార్చి వరకు రెండు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు 451 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేసులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు, ఈ నెలాఖరులోగా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని అంచనా వేసింది. అయితే హెచ్3ఎన్2తో పాటు ఇన్‌ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లు సీజనల్ అని, ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
Next Story






