Kumbh Mela: కుంభమేళా పారిశుద్ధ్య కార్మికులకు గిన్నిస్ రికార్డు.. ఎందుకంటే?

by Yella Dhawani Reddy |

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న సంగతి తెలిసిందే.

Kumbh Mela: కుంభమేళా పారిశుద్ధ్య కార్మికులకు గిన్నిస్ రికార్డు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు 60 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ రికార్డు లక్ష్యంగా ప్రయాగ్‌రాజ్ పారిశుద్ధ్య శాఖ క్లీన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో దాదాపు 15 వేల మంది కార్మికులు చీపురుపట్టి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌(Guinness World Record) రికార్డ్స్‌ ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్‌ మేయర్‌ గణేశ్‌ కేసర్వాని, మహాకుంభ్‌ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. ఇక రికార్డుకు సంబంధించిన వివరాలను మరో మూడు రోజుల్లో వెల్లడించనున్నట్లు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు తెలిపారు. కాగా, 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయనున్నారు.

ఇక జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా.. ఫిబ్రవరి 26న ముగియనుంది. 26న మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story