పెళ్లైన తొలిరాత్రే ఆ భయంతో పారిపోయిన వరుడు.. కట్ చేస్తే గంగాతీరంలో అలా..

by Naga Rani Yarlagadda |

పెళ్లయిన తొలిరాత్రే వరుడు ఇంటి నుంచి పారిపోవడం రెండు కుటుంబాలను ఆందోళనకు గురిచేసింది.

పెళ్లైన తొలిరాత్రే ఆ భయంతో పారిపోయిన వరుడు.. కట్ చేస్తే గంగాతీరంలో అలా..
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లయిన తొలిరాత్రే వరుడు ఇంటి నుంచి పారిపోవడం రెండు కుటుంబాలను ఆందోళనకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్ లోని శారధన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచాపుర్ కు చెందిన మోను అనే వరుడు పరారవ్వడంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోను (26) నవంబర్ 27వ తేదీ రాత్రి ఇంటి నుంచి పారిపోయాడు. అదే రోజు అతనికి పెళ్లి జరగ్గా.. బల్బు తీసుకువచ్చే సాకుతో బయటికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో సీసీటీవీ ఫుటేజీలను కుటుంబ సభ్యులు చెక్ చేయగా గంగాతీరంలో తిరుగుతూ కనిపించాడు. మరింత ఆందోళనకు గురైనవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం తండ్రికి ఫోన్ చేసిన మోను.. తాను సేఫ్ గా ఉన్నానని ఇంటికి తిరిగి వస్తానని తెలిపాడు. దీంతో మేరఠ్ పోలీసులలతో కలిసి హరిద్వార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మోనును ఇంటికి తీసుకొచ్చారు. అతడిని ప్రశ్నించగా.. పెళ్లిరోజు రాత్రి భయాందోళనతోనే వెళ్లిపోయనట్లు తెలిపాడు.

బస్సెక్కి హరిద్వార్ వెళ్లానని, 3 రోజులు స్టేషన్ ప్రాంతంలోనే గడిపానని చెప్పాడు. కానీ.. పెళ్లయనరోజే మోను ఫ్రెండ్స్ కోరిక మేరకు ఏదో తిన్నాడని, దాని తర్వాతనే అతను మానసిక అశాంతికి గురైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అతను సహజగానే భయస్థుడిగా కనిపిస్తున్నాడని, ఇంటి నుంచి వెళ్లిపోవడానికి బలమైన కారణాలేవీ చెప్పలేదని పోలీసులు వెల్లడించారు.

Next Story