- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News: గుర్రం ఎక్కిన కొద్దిసేపటికే! పెళ్లి బారాత్‌లో గుండెపోటుతో వరుడు మృతి
మధ్యప్రదేశ్‌లోని శియోపూర్ నగరంలో ఓ విహాహ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Madhya Pradesh)మధ్యప్రదేశ్‌లోని (Sheopur city) శియోపూర్ నగరంలో ఓ విహాహ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు(బారాత్)లో డీజే పాటలకు డాన్స్ చేసి మండపానికి వెళ్లేందుకు (horse) గుర్రం ఎక్కిన పెళ్ళికొడుకు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన వరుడు బంధువులు, స్నేహితులు సీపీఆర్ చేసి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వరుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వరుడు గుర్రంపైనే కుప్పకూలిన సంబంధిత వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. వరుడు ప్రదీప్ జాట్ (25) కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) మాజీ జిల్లా అధ్యక్షుడు. గత శుక్రవారం రాత్రి నగరంలోని జాట్ హాస్టల్‌లో జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది. అయితే, ప్రదీప్ ముందుగా బారాత్ సమయంలో తనతో పాటు వచ్చిన వ్యక్తులతో కలిసి నృత్యం చేశాడు. తర్వాత గుర్రం ఎక్కిన కొద్ది సేపటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలోకి వెళ్లారు. వరుడు (heart attack) గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.






