జాతీయగీతం ఆలపించలేదని.. గవర్నర్ వాకౌట్

by Thanuru Gopichand |

గవర్నర్ ను వివాదాల కేంద్రంగా మారుస్తూ రాజకీయం.

జాతీయగీతం ఆలపించలేదని.. గవర్నర్ వాకౌట్
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు మరోసారి వివాద కేంద్రంగా మారాయి. తమిళ గీతం తరువాత జాతీయ గీతాన్ని ఆలపించకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సమావేశాల ప్రారంభం గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రసంగం చేయాల్సి ఉంది. దానికి ముందు తమిళ గీతం అనంతరం జాతీయ గీతం ఆలపించాల్సి ఉండగా కేవలం తమిళ గీతాన్ని మాత్రమే ఆలపించారు. అయితే తన ప్రసంగానికి ముందు జాతీయ గీతం కూడా ఆలపించాలని గవర్నర్ డిమాండ్ చేశారు. అయితే సభ ముగింపులోనే జాతీయ గీతం ఆలపిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో గవర్నర్ మైక్ ను పలుమార్లు స్విచ్ఛాఫ్ చేశారు. అంతేకాకుండా ఆయనకు సభలో మాట్లాడనివ్వడం అధికార డీఎంకే నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, వాటిని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించడం జరగలేదని గవర్నర్ ఓ ప్రకనటలో పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు యువత బానిస కావడం, పోక్సో కేసులు కూడా రాష్ట్రంలో పెరిగిపోతుండడం వంటి అంశాలను కూడా లోక్ భవన్ ప్రస్తావించింది. ప్రధానంగా జాతీయ గీతానికి అవమానం జరగడాన్ని గవర్నర్ ఓర్చుకోలేకపోయారు. స్వదేశంలో ఇటువంటి అవమానాన్ని సహించడం సరికాదని భావించి ఆయన అసెంబ్లీ సెషన్ నుంచి వాకౌట్ చేశారు. అయితే దీనిపై అధికార డీఎంకే నేతలు రాజకీయం చేస్తుండగా.. ప్రతిపక్ష నేతలు గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గవర్నర్ ను రాజకీయ పావుగా వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి డీఎంకే నేతలు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఇది మూడోసారి

​గవర్నర్ ఆర్.ఎన్. రవి ఇలా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. గత 2024, 2025 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠంలోని కొన్ని అంశాలతో విభేదిస్తూ ఆయన సభను బహిష్కరించారు. 2026లో జరిగిన ఈ తాజా ఘటనతో లోక్ భవన్, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య దూరం మరింత పెరిగింది. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధమని అధికార పక్షం ఆరోపిస్తుండగా, జాతీయ చిహ్నాలను గౌరవించని చోట గవర్నర్ ఉండలేరని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది మరియు గవర్నర్ అధికారాల పరిధిపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.

Next Story