నేడు లోక్‌సభ ముందుకు కీలక బిల్లు.. 30 రోజులు జైలులో ఉంటే ప్రధాని పదవైనా ఊస్ట్

by Ajay Maddhiboyina |

నేడు లోక్ స‌భ ముందు కీల‌క బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. నేరాలు చేసి జైలుకు వెళితే ప్ర‌ధాన మంత్రి, కేంద్రమంత్రి మ‌రియు ముఖ్య‌మంత్రి ఏ ప్ర‌జాప్ర‌తినిధి అయినా ప‌దవి నుండి త‌ప్పించేలా

నేడు లోక్‌సభ ముందుకు కీలక బిల్లు.. 30 రోజులు జైలులో ఉంటే  ప్రధాని పదవైనా ఊస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: నేడు లోక్ స‌భ ముందు కీల‌క బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. నేరాలు చేసి జైలుకు వెళితే ప్ర‌ధాన మంత్రి, కేంద్రమంత్రి మ‌రియు ముఖ్య‌మంత్రి ఏ ప్ర‌జాప్ర‌తినిధి అయినా ప‌దవి నుండి త‌ప్పించేలా బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అయితే 30 రోజులు జైలులో ఉంటేనే ప‌ద‌వి ఊస్ట్ అవుతుంది. నెల రోజులు జైలులో ఉంటే 31వ రోజే ప‌ద‌వి పోయేలా చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్నారు. ఈ మేర‌కు 130వ రాజ్యంగ స‌వ‌ర‌ణ బిల్లును లోక్ స‌భ‌లో హోంమంత్రి అమిత్ షా ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.

ఇదిలా ఉంటే చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు నేరాల‌కు పాల్ప‌డి, స్కాముల‌కు పాల్ప‌డి జైలుకు వెళ్లి తిరిగి వ‌స్తున్నారు. వ‌చ్చిన త‌ర‌వాత కూడా వారి తీరు మార‌టం లేదు. అంతే కాకుండా ఎలాంటి నేరాలకు పాల్ప‌డినా అధికారం అయితే ఎక్క‌డికీ పోదు అనే ధీమాతో న‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. కానీ కేంద్రం తీసుకురాబోతున్న చ‌ట్టంతో అలాంటి వారి ప్ర‌వ‌ర్త‌న మారే అవ‌కాశం ఉంది. నేరాల‌కు పాల్ప‌డాలంటే ప‌ద‌వి పోతుంద‌నే భ‌యం ఉండే అవ‌కాశం ఉంది. అయితే దీంతో పాటు అస‌లు నేర‌స్తుల‌కు, కేసులు ఉన్న‌వారికి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశ‌మే లేకుండా చేసేలా చ‌ట్టాన్ని తీసుకురావాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలా చేస్తే అస‌లు నేర‌స్థులు రాజ‌కీయాల్లోకి రాకుండా ఉంటారని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Next Story