వేతన జీవులకు తీపికబురు.. పాక్షిక పీఎఫ్‌ విత్‌డ్రా నిబంధనల సరళీకరణ

by Kema Shiva Kumar |

దేశంలోని వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organization) తీపికబురు చెప్పింది.

వేతన జీవులకు తీపికబురు.. పాక్షిక పీఎఫ్‌ విత్‌డ్రా నిబంధనల సరళీకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organization) తీపికబురు చెప్పింది. ఈ మేరకు పార్షియల్ విత్‌డ్రా నిబంధనలు మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉద్యోగులకు మెడికల్ అత్యవసరాలు, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం వంటి అవసరాలకు అర్హత కలిగిన బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. తాజా నిబంధనల మేరకు పార్షియల్ లేదా పూర్తి డబ్బు విత్‌డ్రాకు ఎంప్లాయర్ అనుమతి అవసరం లేదు. UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్)తో ఆధార్, PAN, బ్యాంక్ డీటెయిల్స్ లింక్ చేసి ఉంటే, మొత్తం ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. కంపోజిట్ క్లెయిమ్ ఫారం (ఆధార్) ఉపయోగించి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కాగా, ఇది వరకు మెడికల్, వివాహం లేదా ఇల్లు నిర్మాణం వంటి కారణాలకు పలు సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. 11 ముఖ్య కారణాలతో పార్షియల్ విత్‌డ్రాకు అనుమతిస్తారు. వాటిలో మెడికల్ చికిత్స, ఉన్నత చదువులు, వివాహం, ఇల్లు కొనుగోలు/నిర్మాణం/రెనోవేషన్, హోమ్ లోన్ రీపేమెంట్, ఎలక్ట్రిసిటీ కట్ వంటి అత్యవసరాలు ఉన్నాయి. రిటైర్మెంట్ ముందు 1 సంవత్సరం పీఎఫ్‌లో 90 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక 5 సంవత్సరాల సర్వీస్‌కు ముందు విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ (TDS) వర్తిస్తుంది. అందుకు ఫాం-31 ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఉద్యోగులు unifiedportal-mem.epfindia.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. ఇటీవల పీఎఫ్‌ విత్‌డ్రా నిబంధనలు సరళీకృతం చేయడంతో 2025లో విత్‌డ్రా అప్లికేషన్లు 20శాతానికి పెరిగినట్లుగా EPFO పేర్కొంది.

Next Story