EPFO: ఇక సింగిల్ లాగిన్ తో అన్ని సేవలు.. పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు

by Prasad Jukanti |   (  Updated:2025-09-18 13:01:54  IST  )

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‍వో ఖాతాదారులకు సేవల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

EPFO: ఇక సింగిల్ లాగిన్ తో అన్ని సేవలు.. పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గుడ్ న్యూస్ చెప్పింది. మెంబర్ పోర్టల్ లోనే పీఎఫ్ లావాదేవీలను తెలుసుకునేలా పాస్ బుక్ లైట్ పేరుతో కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. సింగిల్ లాగిన్ తోనే (single login) ఈపీఎఫ్ కు సంబంధించిన అన్ని సేవలూ, పీఎఫ్ కాతా వివరాలు తెలుసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా తెలిపారు. ఈ నిర్ణయంతో పాస్ బుక్ కోసం ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవసరం ఉండదు. సేవలన్ని సింగిల్ లాగిన్ తో నే జరిగిపోనున్నాయి. ఈ నిర్ణయంతో ఫిర్యాదులు తగ్గి పారదర్శకత మరింత మెరుగుపడుతుందని మన్ సుఖ్ మాండవీయా ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story