- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు తీపికబురు.. ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన
ప్రయాణికులకు భారతీయ రైల్వే (Indian Railways) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు భారతీయ రైల్వే (Indian Railways) గుడ్ న్యూస్ చెప్పింది. బుక్ చేసుకున్న టికెట్ల ప్రయాణ తేదీని మార్చుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతున్నట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. ఇక నుంచి ప్రయాణికులు ఎలాంటి రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ప్రయాణికులు ప్రయాణ తేదీల్లో మార్పుల చేసుకొవచ్చు. అయితే, మార్చుకోవాల్సిన తేదీల్లో ఒకవేళ సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యమని, ఆ వ్యత్యాసాన్న ప్రయాణికుడు భారించాల్సి ఉంటుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఆ రెండు పండుగలకు 12 వేల స్పెషల్ ట్రైన్లు..
త్వరలో దీపావళి, ఛట్ పూజ సీజన్ సమీపిస్తున్న క్రమంలో స్వస్థలాలకు వెళ్లి పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంతోషకరమైన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రయాణీకులకు మరో పండుగలాంటి వార్త చెప్పింది. ఈ సీజన్‌లో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం 12 వేల ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణీకులు సులభంగా చేరుకునేలా చేస్తుంది. ఈ నిర్ణయం పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా చేస్తూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని ఇండియన్ రైల్వేస్ అందించనుంది.






