దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన గిగ్‌ వర్కర్లు

by Muthe.Rajitha |   (  Updated:2025-12-25 08:02:29  IST  )

దేశవ్యాప్తంగా స్విగ్గీ, జోమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు పనిచేసే గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు.

దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన గిగ్‌ వర్కర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా స్విగ్గీ, జోమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు పనిచేసే గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్, న్యూ ఇయర్ రోజున సమ్మెకు పిలుపునిచ్చారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) నేతృత్వంలో జరుగుతున్న ఈ సమ్మెకు పని సమయాలు ఎక్కువగా ఉండటం,, వేతనాలు తగ్గడం, భద్రత లేకపోవడం వంటి కారణాలుగా చెబుతున్నారు వర్కర్లు.

10 నిమిషాల డెలివరీ మోడల్ రద్దు చేయాలని, న్యాయమైన వేతనాలు ఇవ్వాలని, పారదర్శక ఇన్‌సెంటివ్‌లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత, ఐడీ బ్లాకింగ్‌-పెనాల్టీలు ఆపడం, విశ్రాంతి సమయాలు వంటి డిమాండ్లతో ఈ నిరసన జరుగుతోంది. కర్ణాటక గిగ్ వర్కర్ల సామాజిక భద్రత చట్టం 2025 అమలు కాకపోవడంపై అక్కడి యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో లక్షలాది వర్కర్లు పాల్గొనే ఈ సమ్మె వల్ల ఈ రెండు రోజుల్లో ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సేవలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.

Next Story