ఏకాకీగా మారుతున్న గులాం నబీ ఆజాద్

by Malleboina Mahesh |

జాతీయ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చ నెలకొంది.

ఏకాకీగా మారుతున్న గులాం నబీ ఆజాద్
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చ నెలకొంది. జమ్మూ–కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భయటకు వచ్చిన ఆయన తన అనుచరులతో కలిసి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం DPAPలో ఆయన ఏకాకిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆజాద్‌కు అత్యంత సన్నిహితులుగా భావించిన పలువురు నాయకులు వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీసింది.

ఆజాద్‌పై BJP , ప్రధానమంత్రి మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాల్లో వచ్చిన విమర్శలు, ముద్ర కారణంగానే ఆయన అనుచరుల్లో అసంతృప్తి పెరిగినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన వెంట ఉన్న నేతలో పార్టీ మారడంతో DPAP పార్టీకి భవిష్యత్ దిశ ఏమిటనే అనుమానాలు పెరిగిపోవడంతో కార్యకర్తలు, నాయకులు ఆయోమయంలో పడిపోయారు. ఈ సమయంలో ఆజాద్ స్వయంగా పార్టీని రద్దు చేసి, రాజకీయ సన్యాసం తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన తీసుకునే నిర్ణయం జమ్మూ–కాశ్మీర్ రాజకీయ సమీకరణలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story