హ్యాష్‌ట్యాగ్ వార్.. నిన్న ‘గెట్ అవుట్ మోడీ’.. నేడు ట్రెండింగ్‌లో ‘గెట్ అవుట్ స్టాలిన్’

by Ramesh Naini |

తమిళనాడులో ట్వీట్టర్ వేదికగా హ్యాష్‌ట్యాగ్ వార్ మొదలైంది. నిన్న ‘గెట్ అవుట్ మోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్ వరల్డ్‌వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంటే.. నేడు గెట్ అవుట్ స్టాలిన్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

హ్యాష్‌ట్యాగ్ వార్.. నిన్న ‘గెట్ అవుట్ మోడీ’.. నేడు ట్రెండింగ్‌లో ‘గెట్ అవుట్ స్టాలిన్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో ట్వీట్టర్ వేదికగా హ్యాష్‌ట్యాగ్ వార్ మొదలైంది. నిన్న ‘గెట్ అవుట్ మోడీ’ (Get Out Modi) అనే హ్యాష్‌ట్యాగ్ వరల్డ్‌వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంటే.. నేడు ‘గెట్ అవుట్ స్టాలిన్’ (Get Out Stalin) ట్రెండింగ్‌లోకి వచ్చింది. నిన్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) వ్యాఖ్యల నేపథ్యంలో గెట్ అవుట్ మోడీ హ్యాష్‌ట్యాగ్‌కు దారితీసింది. దీనికి కౌంటర్‌గా రాష్ట్ర బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్‌ట్యాగ్‌తో డీఎంకేపై విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలోనే అన్నామలై తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘ఒకే కుటుంబం ఆధిపత్యం, అవినీతికి కేంద్రంగా ప్రభుత్వం, అక్రమాలను పట్టించుకోకపోవడం, తమిళనాడును మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం నిలయంగా మారడం, రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, విద్యా మంత్రిత్వ శాఖ శిథిలావస్థకు చేరింది, మహిళలు, పిల్లల పట్ల అనిశ్చిత వాతావరణం, కులం, మతం ఆధారంగా విభజన రాజకీయాలు, పాలనలో వైఫల్యాలు, ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం వంటి కారణాల వల్ల తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే గద్దె దించనున్నారు’ అంటూ అన్నామలై ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో బీజేపీ, డీఎంకే శ్రేణుల మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ వార్ మొదలైంది.

కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద మూడు భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం కొనసాగిస్తే, ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు 'గో బ్యాక్ మోడీ' కి బదులుగా 'గెట్ అవుట్ మోడీ' నినాదాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల కారణంగా తమిళనాడులో రాజకీయం నెట్టింట హీటెక్కింది.

Next Story