వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ పై వేసిన కార్టూన్ పై అభ్యంతరకరంగా ఉండటంతో కేసు నమోదైంది.

వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ పై వేసిన కార్టూన్ పై అభ్యంతరకరంగా ఉండటంతో కేసు నమోదైంది. దీని నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హేమంత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. దానిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ఈ మధ్యకాలంలో కొందరు కళాకారులు, కార్టూనిస్టులు, స్టాండప్ కమెడియన్లు భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 15కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ పై వేసిన కార్టూన్ పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హేమంత్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. జులై 3న ఈ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. కార్టూన్ గీయడంలో లిమిట్స్ దాటాడని పేర్కొంటూ బెయిల్ నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన అతను.. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో కార్టూన్ పబ్లిష్ అయిందని, ఇందులో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపరచలేదని తెలిపాడు. కానీ.. కోర్టు అతని వాదనలతో ఏకీభవించలేదు.

Next Story