కాశ్మీర్‌లో స్థానికుల గొప్ప మనసు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో రైడ్స్.. ఇంట్లో భోజన వసతి

by Ramesh Naini |   (  Updated:2025-04-25 12:18:29  IST  )

ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భయంతో వణికిపోతున్న పర్యాటకులకు కాశ్మీరీలు సాయం చేస్తున్నారు.

కాశ్మీర్‌లో స్థానికుల గొప్ప మనసు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో రైడ్స్.. ఇంట్లో భోజన వసతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహల్గాం (Pahalgam attack) ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భయంతో వణికిపోతున్న పర్యాటకులకు స్థానిక కాశ్మీరీలు తమకు తోచినసాయం చేస్తున్నారు. (Free auto rides) ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగానే వారి గమ్య స్థానాలకు చేరవేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది టూరిస్టులు కాశ్మీర్‌ను వీడారు. శ్రీనగర్ స్థానిక ఆటో డ్రైవర్లు తమ ఆటోలకు ఫ్రీ ఆటో సర్వీస్ ఫర్ టూరిస్ట్, ఎయిర్‌పోర్టు లేదా రైల్వే స్టేషన్ వరకు మేము చేరవేస్తామని చాలా ఆటోలకు బోర్డులు పెట్టి నడుపుతున్నారు. ఇప్పటికే ఉగ్రదాడి ఘటనను వ్యతిరేకిస్తూ జమ్మూ కశ్మీర్‌‌లోని పలు ప్రాంతాల్లో బంద్‌‌లు, ర్యాలీలు చేస్తున్నారు.

చాలా వరకు కాశ్మీర్ అంతటా బంద్ వాతావరణం ఉండటంతో కొంత మంది మిగిలిన టూరిస్టులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీనగర్​కు చెందిన డాక్టర్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. డాక్టర్ ఇర్ఫాన్ అనే వ్యక్తి తన ఇంటినే హోటల్​గా మార్చి పర్యాటకులకు ఉచితంగా ఆవాసాన్ని కల్పించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. హైవే మూసివేత కారణంగా ఇబ్బంది పడుతున్న పర్యటకులు తమ ఇంటిని ఉపయోగించుకోవచ్చని డాక్టర్ చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వారు చేస్తున్న కృషికి నెటిజన్లు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.

Next Story