ఊహించని విషాదం.. ఊపిరాడక నలుగురు మృతి

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

ఊహించని విషాదం.. ఊపిరాడక నలుగురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్‌(Water Tank)ను శుభ్రం చేస్తూ నలుగురు కాంట్రాక్టు కార్మికులు(Contract workers) మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర(Maharastra) ముంబై(Mumbai)లోని నాగ్‌పడా(Nagpada) ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఈ రోజు(ఆదివారం) ఉదయం 11-11.30 గంటల ప్రాంతంలో జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఉన్న ట్యాంక్‌ను క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడకపోవడంతో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని అక్కడే ఉన్న పలువురు ముంబై ఫైర్ బ్రిగాడే ఆసుపత్రి(Hospital)కి తరలించారు. అయితే అప్పటికే అందులోని నలుగురు కార్మికులు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో నలుగురు కార్మికులు మరణించారని.. ఐదవ కార్మికుడు పుర్హాన్ షేక్ (31) ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. మృతుల్లో హసిపాల్ షేక్ (19), రాజా షేక్ (20), జియావుల్లా షేక్ (36), ఇమాండు షేక్ (38) ఉన్నారు.

Next Story