- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. ఆ నలుగురు ఎన్ఆర్ఐలు మృతి
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. వెస్ట్ వర్జీనియాలోని ఆ ఆలయానికి వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా.. ఆచూకీ లభ్యం కాలేదు. తాజాగా ఆ నలుగురు ప్రమాదంలో మరణించినట్లు మార్షల్ కౌంటీ పోలీసులు తెలిపారు. బాధిత వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన ఆశా దివాన్ (85), కిశోర్ దివాన్ (89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)లుగా గుర్తించారు.
వీరంతా న్యూయార్క్ లోని బఫలో నుంచి వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో ఉన్న ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ కు బయల్దేరారు. దారిమధ్యలో బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డులో కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కట్టవైపు దూసుకెళ్లింది. జులై 29నే వీరంతా అదృశ్యం కాగా.. ఆగస్టు 2న ప్రమాదానికి గురైన వెహికల్ ను పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా జులై 29న వీరంతా పెన్సిల్వేనియాలోని రెస్టారెంట్ కు వెళ్లినట్లు సీసీటీవీల్లో రికార్డింగ్స్ లో గుర్తించారు.






