- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఉపరాష్ట్రపతి తీవ్ర అస్వస్థత! ఎయిమ్స్‌లో చేరిక
భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ (74) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయన రెండు సార్లు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కుటుంబ సభ్యులు చేర్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ (74) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయన రెండు సార్లు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కుటుంబ సభ్యులు చేర్చారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గత శనివారం ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయన రెండుసార్లు స్పృహ కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో, సోమవారం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆయన ఎయిమ్స్‌కు తీసుకురాగా.. పరిస్థితిని గమనించిన వైద్యులు తదుపరి పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరాలని సూచించారు.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో..
ప్రస్తుతం ధన్కడ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు MRI స్కాన్‌తో పాటు మరికొన్ని కీలక నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని సమాచారం. రేపు (మంగళవారం) ఆయన ఆరోగ్య పరిస్థితిని మరోసారి సమీక్షించిన అనంతరం డిశ్చార్జ్ విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
గతంలోనూ పలుమార్లు అస్వస్థత..
ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా జగదీప్ ధన్కడ్ పలు బహిరంగ కార్యక్రమాల్లో అస్వస్థతకు గురయ్యారు. రణ్ ఆఫ్ కచ్, ఉత్తరాఖండ్, కేరళ, ఢిల్లీలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పలుమార్లు స్పృహ తప్పి పడిపోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, నిరంతరం వేధిస్తున్న ఈ ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన గతేడాది జూలై 21న తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.






