అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు కన్నుమూత

by Muthe.Rajitha |

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు నేడు కన్నుమూశాడు. మాజీ ప్రెసిడెంట్ డిక్ చెనీ (84) న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబం ప్రకటించింది.

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు నేడు కన్నుమూశాడు. మాజీ ప్రెసిడెంట్ డిక్ చెనీ (84) న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబం ప్రకటించింది. అమెరికా చరిత్రలో అత్యంత శక్తిమంతమైన ఉపాధ్యక్షుడిగా పేరు పొందారు. 9/11 ఉగ్రదాడుల అనంతరం ‘వార్ ఆన్ టెర్రర్’ ప్రధాన రూపకర్తగా, ఇరాక్‌పై తప్పుడు ఆరోపణలతో 2003 దాడులకు పునాది వేసిన వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కారు.

1941లో నెబ్రాస్కాలో జన్మించిన చెనీ... వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, డిఫెన్స్ సెక్రటరీగా విధులు నిర్వహించి, 2001-09 మధ్య జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఉపాధ్యక్షుడయ్యారు. దశాబ్దాలుగా కఠిన సంప్రదాయవాదిగా, శక్తిమంతమైన రిపబ్లికన్ నేతగా నిలిచిన ఆయన చివరి సంవత్సరాల్లో డొనాల్డ్ ట్రంప్‌ను పిరికిపందగా, దేశానికి అతిపెద్ద ముప్పుగా విమర్శించి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు ఓటేసినట్లు ప్రకటించారు డిక్ చెనీ.

Next Story