మాజీ ఎంపీ రామ్‌విలాస్ వేదాంతి కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం

by Kema Shiva Kumar |

దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి (MP Ramvilas Vedanthi) (67) కన్నుమూశారు.

మాజీ ఎంపీ రామ్‌విలాస్ వేదాంతి కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి (MP Ramvilas Vedanthi) (67) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా (Reva)లో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాన విడిచారు. అయితే, రామ్ వలాస్ వేదాంతి వేదాంతి అంత్యక్రియలు ఇవాళ అయోధ్యలో జరగనున్నాయి. ఆయన తన జీవితాన్ని మొత్తం అయోధ్య ఆలయ నిర్మాణం కోసమే అర్పించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా, రెండు సార్లు ఎంపీగా కూడా పనిచేశారు. రామ్ విలాస్ వేదాంతి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, విపక్ష నాయకులు నివాళులర్పిస్తూ సంతాపం ప్రకటించారు.

Next Story