- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Former Miss Puducherry: వర్ణ వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడిన మాజీ మిస్ పుదుచ్చేరి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులకు తోడు వ్యక్తిగత ఒత్తిడి వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సంబంధీకులు తెలిపారు

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ మోడల్, ఫ్యాషన్ పరిశ్రమలో అందరినీ కలుపుకుని పోవాలని కోరుకునే మాజీ మిస్ పుదుచ్చేరి శాన్ రీచల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచ్చేరిలోని తన ఇంట్లో మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం. అధిక ఒత్తిడి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శాన్ రీచల్ ఆత్మహత్య చేసుకుందని, రెండు ఆసుపత్రులకు తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, చివరగా జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్)లో ఆమె మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మధ్యే ఆమె వివాహం కూడా జరిగింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు వ్యక్తిగత ఒత్తిడి వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సంబంధీకులు తెలిపారు. ఫ్యాషన్ రంగంలో కొనసాగేందుకు ఆభారణాలను విక్రయించే స్థితి చేరుకున్నారని, తండ్రి సాయం అందకపోవడం వంటి అంశాలు ఆమెను కృంగదీశాయని తెలుస్తోంది. పోలీసులు తమ పరిశీలనలో ఆత్మహత్యకు సంబంధించిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని అందులో ఆమె పేర్కొన్నట్టు సమాచారం.
శాన్ రీచల్ ఫ్యాషన్ పరిశ్రమలోని అడ్డంకులను ఛేదించి, వైవిధ్యాన్ని తీసుకురావాలనే ఆమె సంకల్పంతో పేరు తెచ్చుకుంది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన రీచల్, మోడలింగ్ వృత్తిని కొనసాగించాలనే కలలకు మద్దతు ఇచ్చిన ఆమె తండ్రి గాంధీ దగ్గర పెరిగారు. ఫెయిర్-స్కిన్ చుట్టూ ఉన్న పక్షపాతాలను ధిక్కరించి మరీ ఆమె ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణించారు. రీచల్ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపించారు. విదేశాల్లో ఫ్యాషన్ షోలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 'ఫెయిర్ స్కిన్' ప్రమాణాల ఆధిపత్యాన్ని సవాలు చేయడం ద్వారానే ఆమె గుర్తింపు పొందారు. 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు టైటిల్‌తో పాటు, 2021లో మిస్ పుదుచ్చేరిని గెలవడం ద్వారా మరింత పేరు సంపాదించారు.






