'భారత్' భాగస్వామ్య దేశాల బలోపేతానికి... 'తరంగ్ శక్తి'.!

by Geesa Chandu |

భారత్ త్రివిధ దళాల సమన్వయంతో.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు 'తరంగ్ శక్తి' యుద్ధ విన్యాసాలను ఆగష్టు 6 నుంచి తమిళనాడులోని సూలూరులో నిర్వహిస్తున్నారు.

భారత్ భాగస్వామ్య దేశాల బలోపేతానికి... తరంగ్ శక్తి.!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ త్రివిధ దళాల సమన్వయంతో.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు 'తరంగ్ శక్తి' యుద్ధ విన్యాసాలను ఆగష్టు 6 నుంచి తమిళనాడులోని సూలూరులో నిర్వహిస్తున్నారు. భారత త్రివిధ దళాల సైన్యాలు ఆర్మీ, నేవీ మరియు వాయుసేనలు కలిసి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ విన్యాసాలకు మొత్తం 51 దేశాలకు ఆహ్వానం పంపగా.. అందులో 30 కి పైగా దేశాలు హాజరైనట్లు తెలుస్తోంది.

మొదటి దశలో..

తమిళనాడులో ఆగస్టు 6 నుండి 14 వరకు జరిగే ఈ విన్యాసాలకు భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ మొదటి దశ విన్యాసాలు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా యుద్ధ నౌకలపై హెలికాఫ్టర్ల ల్యాండింగ్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లపై మిగ్ - 29, రఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగ్, ఫైరింగ్ తో పాటుగా పలు విన్యాసాలు నిర్వహిస్తోంది.

రెండవ దశలో..

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 12 వరకు రెండవ దశ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. కాగా మొదటి దశ విన్యాసాల్లో.. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, కెన్యా, బంగ్లాదేశ్, నేపాల్, గినియాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మరియు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Next Story