Viral: బిల్డింగ్‌ బాల్కని నుంచే ఫ్లైఓవర్.. నాగ్‌పూర్‌లో వెలుగు చూసిన ఈ అద్భుతంపై నెట్టింట ట్రోలింగ్

by Ramesh Naini |   (  Updated:2025-09-12 15:50:26  IST  )

బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో జరిగిన ఓ నిర్మాణ లోపంతో ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో సింపుల్‌గా తెలిసిపోతుందని నెట్టింట చర్చానీయంశంగా మారింది.

Viral: బిల్డింగ్‌ బాల్కని నుంచే ఫ్లైఓవర్.. నాగ్‌పూర్‌లో వెలుగు చూసిన ఈ అద్భుతంపై నెట్టింట ట్రోలింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో జరిగిన ఓ నిర్మాణ లోపంతో ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో సింపుల్‌గా తెలిసిపోతుందని నెట్టింట చర్చానీయంశంగా మారింది. బిల్డింగ్‌లో నుంచే ఫ్లైఓవర్ (Flyover) నిర్మించిన విధానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. (Nagpur) నాగ్‌పూర్‌ ప్రధాన ప్రాంతంలో రూ.998 కోట్ల వ్యయంతో (Nagpur-Dighori) నాగ్‌పూర్-డిఘోరి ప్రాజెక్టులో భాగంగా ఓ ఫ్లై ఓవర్‌ను ప్రభుత్వం నిర్మించింది.

అయితే, వంతెన నిర్మాణంలో భాగంగా అశోక్ చౌక్ వద్ద ఒక వింత దృశ్యం అందరిని షాకింగ్‌కు గురిచేసింది. ఫ్లై ఓవర్ వచ్చే ఆ ప్రాంతంలో మూడు అంతస్తుల భవనం ఉండగా.. దానిని ఇంజినీర్లు కూల్చలేదు. పరిణామాల్ని అంచనా వేయకుండా బిల్డింగ్ లోపలి బాల్కనీ నుంచే బ్రిడ్జ్‌ని నిర్మించారు. ఇది మెయిన్ రోడ్డు జంక్షన్ మీద ఉండటంతో వాహనాదారులు, బాటసారులు అగీ మరి బిల్డింగ్‌‌లో ఫ్లై ఓవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్ నిర్మాణంపై నెట్టింట్లో ట్రోలింగ్స్ జరిగాయి.

ఇది అద్భుత ఇంజినీరింగ్ పనితనం అని నెటిజన్‌లు సెటైర్లు వేశారు. ఇక, భవనం అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా నిర్మించారిని అధికారులు చెబుతున్నారు. భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) ఆక్రమణను తొలగించాలని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (NMC)కి లేఖ రాసినట్లు వెలుగులోకి వచ్చింది. నిర్మాణ దశలోనే "ఆక్రమణ" జరిగిందని, ఈ విషయాన్ని NMC దృష్టికి తీసుకెళ్లామని NHAI సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వైరల్ వీడియో..

Next Story