ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-04 11:19:51  IST  )

ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ(West Bengal Assembly)లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. అధికార, విపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్త తీవ్రరూపం దాల్చి ఘర్షణకు దారి తీసింది. గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) మాట్లాడుతున్నంతసేపు బీజేపీ ఎమ్మెల్యేలంతా(BJP MLAs) ప్రభుత్వానికి, సీఎం మమతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిగా అధికార తృణముల్ ఎమ్మెల్యేలు కూడా నినాదాలు చేశారు. దీంతో గొడవ మొదలైంది. ఎవరికి వారు నినాదాలతో సభను హోరెత్తించారు.

ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో గొడవ మరింత ముదిరింది. వెంటనే స్పందించిన అసెంబ్లీ మార్షల్స్ బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు లాక్కెల్లారు. అనంతరం సీఎం మమత మాట్లాడుతూ.. బీజేపీ అవినీతి, ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ బందిపోట్ల పార్టీ అని.. దేశంలో కొనసాగే అర్హత ఆ పార్టీకి లేనే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

Next Story