ముట్టుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తా.. శోభనం గదిలో కత్తితో వధువు వార్నింగ్.. కట్ చేస్తే..

by Sujitha Rachapalli |

పెళ్లి అంటేనే దడపుట్టే మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్‌కు సితార అనే యువతితో ఘనంగా వివాహం జరిగింది. అయితే ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అతనికి శోభనం రాత్రే షాక్ తగిలింది

ముట్టుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తా.. శోభనం గదిలో కత్తితో వధువు వార్నింగ్.. కట్ చేస్తే..
X

దిశ, వెబ్‌సైట్ : పెళ్లి అంటేనే దడపుట్టే మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్‌కు సితార అనే యువతితో ఘనంగా వివాహం జరిగింది. అయితే ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అతనికి శోభనం రాత్రే షాక్ తగిలింది. తాను వరుసకు అల్లుడైన అమన్‌ను ప్రేమించానని.. అతనితోనే వెళ్లిపోతానని చెప్పింది వధువు. శోభనం కదా అని తన ఒంటి మీద చెయ్యేందుకు ప్రయత్నిస్తే ముక్కలు ముక్కులగా నరుకుతానంటూ కత్తితో బెదిరించింది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని.. చంపేస్తానని హెచ్చరించింది.

ఇది జరిగిన మూడు రోజులకు సితార గోడ దూకి పారిపోగా.. బయటకు వచ్చిన నిషాద్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఆమె చంపేస్తుందనే భయంతో తనతో ఉన్న మూడు రోజులు నిద్రపోలేదని చెప్పాడు. పైగా ఆమె తనను కేదార్‌నాథ్ తీసుకెళ్లమని అడిగిందని.. ఇది విన్నాక ఇటీవల జరిగిన రాజారఘువంశి హత్య గుర్తొచ్చి ఆగిపోయాయని.. ఆమె తనతో ఉన్నంత సేపు భయంతోనే బతికానని తెలిపాడు నిషాద్. పైగా సితార బాయ్ ఫ్రెండ్ అమన్ కూడా చంపేస్తానని మెసేజ్‌లు పెట్టాడని చెప్పుకొచ్చాడు.

Next Story