Shocking: అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై కాల్పులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-05 12:06:05  IST  )

అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Shocking: అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్(US Vice President JD Vance) ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. అకస్మాత్తుగా ఇంటిపై కాల్పులు జరపడంతో ఇంటి అద్ధాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంబడించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కాగా, నిన్ననే వెనిజులాపై అమెరికా చర్యలపై వాన్స్ స్పందించారు. ఈ చర్యల వెనుక చమురు ప్రయోజనాలే కారణమని వస్తున్న విమర్శలకు జేడీ వాన్స్ కౌంటర్ ఇచ్చారు. ఒక కమ్యూనిస్ట్ మా ఆస్తులను దొంగిలిస్తే, మేం ఏమీ చేయకుండా చూస్తూ ఉండాలా? మహాశక్తులు అలా ప్రవర్తించవు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా మళ్లీ ఒక మహాశక్తిగా నిలిచింది' అని వాన్స్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ చేసిన మరుసటి రోజే వాన్స్ ఇంటిపై కాల్పులు జరుగడం కలకలం రేపుతోంది.

Next Story