'వర్క్ షాప్' లో మంటలు.. హరియాణాలో ఘటన, భారీగా ఆస్తి నష్టం!

by Geesa Chandu |

హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో సెక్టార్ 41 ప్రాంతానికి చెందిన ఒక వర్క్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వర్క్ షాప్ లో మంటలు.. హరియాణాలో ఘటన,  భారీగా ఆస్తి నష్టం!
X

దిశ, వెబ్ డెస్క్: హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో సెక్టార్ 41 ప్రాంతానికి చెందిన ఒక వర్క్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే లగ్జరీ కార్లకు సంబంధించిన తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాద ఘటన లో.. తొలుత వర్క్ షాప్ లో ఉన్న ఒక కారు లోంచి మంటలు చెలరేగాయి. దీంతో వరుసలోని మిగిలిన కార్లకు కూడా మంటలు వ్యాపించటంతో.. ఆ కార్లన్నీ దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీ నష్టం సంభవించింది. అయితే ప్రమాదంలో దగ్ధమైన వాహనాల విలువ రూ. 7 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

Next Story