- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maha Kumbh: కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం(Massive fire) జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం(Massive fire) జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని సెక్టార్-8 ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. యాత్రికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రయాగ్ రాజ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ఇది 'చిన్న' అగ్నిప్రమాదమని, మంటలు చెలరేగిన కొద్దిసేపటికే వాటిని అదుపులోకి తెచ్చామన్నారు. “శ్రీ కపి మానస్ మండల్ , ఉపభోక్త సంరక్షణ సమితి శిబిరాల్లో మంటలు చెలరేగాయి. శిబిరంలోని రెండు టెంట్లు కాలిపోయాయి. ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు” అని శర్మ మీడియాకు తెలిపారు.
వరుస ప్రమాదాలు
కాగా, మహాకుంభ్‌లో 30 రోజుల వ్యవధిలోనే అగ్నిప్రమాదం జరగడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. తొలుత జనవరి 19వ తేదీన మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. రెండో అగ్నిప్రమాదం జనవరి 30న మూడోది ఫిబ్రవరి 17న మూడోది జరిగాయి. రెండ్రోజుల క్రితం సెక్టార్ 19లో మంటలు చెలరేగి ఏడు టెంట్లు కాలిపోయాయి. కాగా.. ఇప్పుడు జరిగిన ప్రమాదం ఐదోది. ఇదిలా ఉండగా.. ఈ మహాకుంభమేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున ముగియనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ఇప్పటి వరకూ 53 కోట్ల మంది హాజరయ్యారు.






