- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire accident: మహాకుంభమేళాలో మరో అగ్నిప్రమాదం
మహాకుంభమేళాలో మరో అగ్నిప్రమాదం సంభవించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలో జరుగుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో (Mahakumbha Mela) మరోసారి అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలోని (Shankaracharya Marg) ఓ గుడారంలో మంటలు చెలరేగాయి. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సర్వేశ్ కుమార్ జాతీయ మీడియాకు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితం సెక్టార్ -22 లో గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల అక్కడ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహాకుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనున్నది. గురువారం నాటికి 39 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.






