- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire accident: మరో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
by B.Srinivas |
మహారాష్ట్ర లోని షోలాపూర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అక్కల్‌కోట్ రోడ్డులో ఉన్న టెక్స్‌టైల్ మిల్స్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra) లోని షోలాపూర్ (Sholapoor) జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎంఐడీసీ అక్కల్‌కోట్ రోడ్డులో ఉన్న సెంట్రల్ టెక్స్‌టైల్ మిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఫ్యాక్టరీ యజమాని హాజీ ఉస్మాన్ హసన్‌భాయ్ మన్సూరి, ఆయన కుటుంబంలోని ముగ్గుకు వ్యక్తులు సైతం మరణించినట్టు అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు కేరళ (Kerala) లోని కోజికోడ్‌లో ఉన్న ఒక వస్త్ర మార్కెట్‌లోనూ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
Next Story






