- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nitin Gadkari: అసలైన సినిమా ఇంకా మిగిలే ఉంది.. నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
మోడీ 11 ఏళ్ల పాలన, 2029 ఎన్నికల్లో తన పాత్రపై నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో:11 ఏళ్ల మోడీ పాలన, 2029 సార్వత్రిక ఎన్నికల్లో తన పాత్రను ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలై సినిమా మిగేలే ఉందని హాట్ కామెంట్స్ చేశారు. నాగ్ పూర్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పార్టీ తన కార్యకర్తల బాధ్యతలను నిర్ణయిస్తుంది. తనకు ఏ పని అప్పగించినా చేస్తాను. మోడీ 11 ఏళ్ల పాలనపై (Modi Government) స్పందిస్తూ 'అభి తక్ జో హువా హై వో తో న్యూస్ రీల్ థీ'.. అస్లీ ఫిల్మ్ షురు హోనా ఔర్ బాకీ హై' (మీరు ఇప్పటివరకు చూసినది కేవలం న్యూస్ రీల్, అసలైన సినిమా ఇంకా మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. తానెప్పుడు తన రాజకీయ బయోడేటాను చెప్పుకోలేదు. విమానాశ్రయాల్లో తనకు గొప్ప స్వాగత కార్యక్రమాలు నిర్వహించాలని తన మద్దతుదారులను ఎప్పుడూ కోరలేదన్నారు.
జనాభా వల్లే అభివృద్ధి ఫలాలు కనిపించడం లేదు:
విదర్భలో రైతు ఆత్మహత్యలను ఆపడానికి కృషి చేచయడమే తన వ్యక్తిగత కోరిక అని చెప్పారు. ప్రస్తుతం నేను రోడ్డు పనుల కంటే వ్యవసాయం ఇతర సామాజిక కార్యక్రమాలపై ఎక్కువగా పని చేస్తున్నట్లు చెప్పారు. తలసరి ఆదాయంలో దేశం ప్రపంచంలోని టాప్ 10 కంట్రీలతో లేకపోవడానికి దేశ జనాభానే కారణం అని అన్నారు. జనాభా నియంత్రణ బిల్లుకు మద్దతు ఇస్తూ ఇది మతపరమైన లేదా భాషాపరమైన సమస్య కాదని ఇది ఆర్థికపరమైన సమస్య అన్నారు. ఇంత అభివృద్ధి జరిగినప్పటికీ, దాని ఫలాలు కనిపించడం లేదని ఇందుకు పెరుగుతున్న జనాభా కారణం అన్నారు.






