- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో వింత.. మహిళ గర్భాశయంలో కాదు కాలేయంలో పెరుగుతున్న పిండం..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ మహిళకు కొన్ని వారాలుగా వాంతులు, కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కుటుంబీకులు. టెస్టులు, ఆల్ట్రాసౌండ్‌తో స్పష్టత రాకపోయేసరికి ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ మహిళకు కొన్ని వారాలుగా వాంతులు, కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కుటుంబీకులు. టెస్టులు, ఆల్ట్రాసౌండ్‌తో స్పష్టత రాకపోయేసరికి ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. ఇందులో వైద్య రంగంలోనే అత్యంత అరుదైన విషయం బయటపడింది. ఈ మహిళ గర్భంతో ఉందని.. కానీ పిండం గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరుగుతుందని గుర్తించబడింది. ఇలాంటి కేసులు ప్రపంచంలో కేవలం ఎనిమిది మాత్రమే నమోదు కాగా ఇండియాలో ఇదే మొదటిది. ఇక ఈ పరిస్థితిని ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తుండగా.. ప్రస్తుతం ఆమె వైద్యుల పరిశీలనలో ఉంది.
కాగా మీరట్‌లోని ప్రైవేట్ ఇమేజింగ్ సెంటర్‌లో రేడియాలజిస్ట్ డాక్టర్ కేకే గుప్తా ఈ స్కాన్ గురించి వివరించారు. 12 వారాల గర్భం కాలేయం కుడి భాగంలో ఉందని.. హార్ట్ బీట్ క్లియర్‌గా కనిపించిందని తెలిపారు. అయితే ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని.. లివర్‌లో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయని.. పిండం పెరిగే కొద్దీ అవి పగిలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు శస్త్రచికిత్స అవసరమని.. డాక్టర్లు ఇందుకోసం సిద్ధమవుతున్నారని తెలిపారు.






