నాన్నా.. నీ కలలను తప్పక నెరవేరుస్తా: రాహుల్‌ గాంధీ ఎమోషనల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-21 12:17:23  IST  )

దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) వర్థంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీ (Delhi)లోని వీర్‌భూమి (Veer Bhomi)లో ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ అగ్రనేత, లోకస‌భ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పుష్పగుచ్ఛాలు ఉండి నివాళులర్పించారు.

నాన్నా.. నీ కలలను తప్పక నెరవేరుస్తా: రాహుల్‌ గాంధీ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) వర్థంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీ (Delhi)లోని వీర్‌భూమి (Veer Bhomi)లో ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ అగ్రనేత, లోకస‌భ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పుష్పగుచ్ఛాలు ఉండి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ (Sonia Gandhi)తో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పాల్గొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్) వేదికగా ఎమోషన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా.. నీ జ్ఞాపకాలు ప్రతి అడుగులో నాకు మార్గదర్శనం చేస్తాయి. నీ పూర్తి కాని కలలను సాకారం చేయడమే నా సంకల్పం, వాటిని నేను నెరవేరుస్తా’. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Next Story