- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
by Muthe.Rajitha |
పంజాబ్(Panjab)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్(Panjab)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. రాష్ట్రంలోని హోషియార్‌పూర్(Hoshiapur) జిల్లాలో దసూహా-హాజీపూర్ రహదారిపై జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలవగా, 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పి బోల్తా పడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షుల సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
Next Story






