- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం
మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బైక్ ను తప్పించబోయి అదుపుతప్పి బోర్లా పడటంతో 10 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. భండారా నుంచి గొండియా(Bhandara-Gondia) వెళ్తున్న బస్సుకు అనుకోకుండా ఓ బైక్ ఎదురు రావడంతో దానిని తప్పించే క్రమంలో.. మరోవైపు తిప్పడంతో వేగం కంట్రోల్ అవక బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- Tags
- maharastra






