- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ.. అసలు విషయం ఇదే!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు(Devotees) తరలివచ్చారు

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు(Devotees) తరలివచ్చారు. జనవరి 13వ తేదీన ప్రారంభమై.. ఫిబ్రవరి 26వ తేదీన ముగిసింది. గత నెల 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో కుంభమేళాలో పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి, భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రీసెంట్‌గా ఈ మహాకుంభమేళాలో ఓ కుటుంబం ఏకంగా రూ. 30 కోట్లు సంపాదించినట్లు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) పేర్కొన్నారు. ఈ తరుణంలో కుంభమేళా వల్ల ఎంతో మంది ఆర్థికంగా లాభపడినట్లు తెలిపారు. ఓ కుటుంబం 130 పడవలు(boats) నడిపి రూ. 30 కోట్లు సంపాదించిందన్నారు.
ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా రూ.30 కోట్లు సంపాదించిందని సీఎం యోగి చెప్పిన విషయం పై పడవలు నడిపే వారు స్పందిచారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ..అయితే సీఎం చెప్పినట్లు అది ఒక ఫ్యామిలీ కాదు. బోట్లు నడుపుకునే ఓ 100 కుటుంబాల కమ్యూనిటీ అని తెలిపారు. మాకు 130 బోట్లు ఉన్నాయి. బోటు ఆపరేటర్లు గతంలో రూ.50 వేల నుంచి రూ.లక్ష చొప్పున సంపాదిస్తే కుంభమేళాలో రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదించారు. భక్తులు భారీగా విరాళాలు ఇచ్చారు అని వారు తెలిపారు.






