Fadnavis: ఔరంగజేబు సమాధిని చట్టబద్ధంగా తొలగించాలి.. దేవేంద్ర ఫడ్నవీస్

by B.Srinivas |

ఔరంగా జేబు సమాధి అంశంపై మహారాష్ట్రలో రాజకీయ వేడి నెలకొన్న నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.

Fadnavis: ఔరంగజేబు సమాధిని చట్టబద్ధంగా తొలగించాలి.. దేవేంద్ర ఫడ్నవీస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఔరంగా జేబు సమాధి అంశంపై మహారాష్ట్రలో రాజకీయ వేడి నెలకొన్న నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) స్పందించారు. ఛత్రపతి శంభాజీనగర్‌ (Shambaji nagar) లోని ఔరంగజేబు సమాధిని తొలగించేందుకు తాము సిద్ధమని కానీ ఆ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని పిలుపునిచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల దానికి చట్టపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయని ఆరోపించారు. సోమవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఔరంగా జేబు సమాధి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఆధీనంలో ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సమాధి నిర్వహణను ఏఎస్ఐ చూసుకుంటుందని చెప్పారు. ఔరంగా జేబు సమాధిని తొలగించాలని రాష్ట్రంలోని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారని, కానీ ఆ ప్రక్రియ చట్టపరిధిలోనే జరగాలని స్పష్టం చేశారు.

కాగా, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, బీజేపీ ఎంపీ ఎంపీ ఉదయన్‌రాజే భోస్లే ఇటీవల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ స్పందించారు. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేత అబూ అజ్మీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఔరంగజేబు దేవాలయాలను నిర్మించాడని, ఆయన క్రూరమైన చక్రవర్తి కాదని ఆజ్మీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఔరంగా జేబు సమాధిపై రాజకీయంగా దుమారం రేగడం గమనార్హం.

Next Story