- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kharge: అధికారం కోసం బీజేపీ దేనికైనా తెగిస్తుంది: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
కొందరు బతికుండగానే చనిపోయినట్టుగా చూపి, వారి ఓట్లను తొలగించారని విమర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో అధికార బీజేపీపై కనగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలో కొనసాగేందుకు బీజేపీ ఎంత తీవ్రమైన అనైతికతకైనా పాల్పడుతుందని ఆరోపించారు. శుక్రవారం భారత స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయని తేలింది. బీహార్‌లో ఓటర్ల లిస్టుకు సంబంధించి ప్రత్యేక సవరణ పేరుతో ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను బహిరంగంగానే తొలగించారు. కొందరు బతికుండగానే చనిపోయినట్టుగా చూపి, వారి ఓట్లను తొలగించారని విమర్శించారు. ఇప్పుడున్న అధికారాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ఎంతవరకైనా వెళ్తుంది. బీహార్‌లో తొలగించిన వారి ఓట్ల విషయంలో ఎందుకనే కారణాలను కూడా ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వలేకపోయింది. ఇలాంటి సమయంలో భారత అత్యున్నంత న్యాయస్థానం ప్రజల గొంతును విని, ఓటర్ల లిస్టును బహిరంగంగా ఉంచాలని ఆదేశాలివ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే, ఇక్కడ ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగించినప్పటికీ అధికార పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దీనర్థం లక్షలాది మంది ఓటర్లను తొలగించినా వారికి అభ్యంతరం లేదనేనా? దీన్నిబట్టి ఎవరికి లాభమో తెలుస్తోందన్నారు.
ఇదే సమయంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను దుర్వినియోగం చేయడంపై ఖర్గె మండిపడ్డారు. ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అన్నారు. స్వాతంత్ర్యం తెచ్చుకున్నాక సుమారు రెండున్నర సమవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ప్రపంచంలో మరే రాజ్యాంగంతోనూ పోల్చలేని విధంగా దీన్ని తయారు చేసుకున్నాం. అన్నిటికన్నా రాజ్యాంగమే అత్యుత్తమైనదని, అన్ని వర్గాలకు సమాన హక్కులు మన రాజ్యాంగం ఇచ్చిందని ఖర్గే పేర్కొన్నారు.






