EU: యూఎస్ వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేసిన ఈయూ పార్లమెంట్

by S Gopi |

ట్రంప్ డిమాండ్‌, ప్రణాళికను వ్యతిరేకించే యూరోపియన్ మిత్రదేశాలపై సుంకాల బెదిరింపులకు నిరసనగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

EU: యూఎస్ వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేసిన ఈయూ పార్లమెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూరోపియన్ యూనియన్ (ఈయూ), యునైటెడ్ స్టేట్స్ మధ్య వాణిజ్య ఒప్పందం ప్రక్రియను నిలిపేయాలని యూరోపియన్ పార్లమెంట్ నిర్ణయించింది. గ్రీన్‌ల్యాండ్‌ను తన ఆధీనంలోకి తీసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌, ప్రణాళికను వ్యతిరేకించే యూరోపియన్ మిత్రదేశాలపై సుంకాల బెదిరింపులకు నిరసనగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గత జూలైలో స్కాట్లాండ్‌లోని టర్న్‌బెర్రీలో జరిగిన వాణిజ్య ఒప్పందంలో జరిగిన అనేక అమెరికా ఉత్పత్తులపై దిగుమతి పన్నులను తగ్గించడం లేదా తొలగించడం గురించి ఈయూ పార్లమెంట్ చర్చిస్తోంది. ఈ ఒప్పందంలో 2020లో మొదట అంగీకరించిన యూఎస్ లాబ్‌స్టర్‌లపై సున్నా దిగుమతి సుంకాన్ని కొనసాగించే అంశం కూడా ఉంది. అయితే, ఈ మార్పులను ఇప్పటికీ ఈయూ పార్లమెంట్, ఈయూ ప్రభుత్వాల ఆమోదం అవసరం.

చాలా మంది యూరోపియన్ చట్టసభ సభ్యులు ఈ ఒప్పందం ఈయూకి అన్యాయమని భావిస్తున్నారు. ఈయూ దాని దిగుమతి సుంకాలలో ఎక్కువ భాగాన్ని తగ్గించాల్సి ఉంటుందని, అయితే యూఎస్ ఇప్పటికీ అనేక ఈయూ వస్తువులపై 15 శాతం సుంకాన్ని కొనసాగిస్తున్నట్టు వారు ప్రస్తావిస్తున్నారు. కొన్ని భద్రతా నిబంధనలతో యూరప్ ఈ ఒప్పందాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అమెరికా నుంచి వచ్చిన కొత్త బెదిరింపులు వారి అభిప్రాయాన్ని మార్చుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఈ బెదిరింపుల కారణంగా, ఈయూ ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం అమెరికాకు మరింత కోపం తెప్పించవచ్చు. భవిష్యత్తులో యూరోపియన్ వస్తువులపై ఇంకా ఎక్కువ పన్నులు విధించడానికి దారితీయవచ్చు.

Next Story