- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Elon Musk : "నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్" : రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన పోస్ట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk )మరో వివాదంతో చిక్కుకున్నారు. ఈసారి మస్క్ ఆర్థిక, రాజకీయ వివాదాల్లో కాకుండా ఓ బిడ్డకు తనే తండ్రి అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk )మరో వివాదంతో చిక్కుకున్నారు. ఈసారి మస్క్ ఆర్థిక, రాజకీయ వివాదాల్లో కాకుండా ఓ బిడ్డకు తనే తండ్రి అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్ (Ashley St. Clair's) తాను ఐదు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మ()Birth of a child)నిచ్చానని.. ఆ చిన్నారికి తండ్రి మస్క్(The child's father is Musk) అని ఎక్స్ లో పోస్టుతో సంచలనం రేపింది. నా బిడ్డ మస్క్ కు 13వ సంతానమని క్లెయిర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మా బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ 'ఎక్స్' వేదికగా షేర్ చేసింది. తామిద్దరం దీనిని గోప్యంగా ఉంచాలనుకున్నామని...కొన్ని మీడియా సంస్థలు దానిని బహిర్గతం చేశాయని ఆమె తెలిపారు. అందుకే ఇప్పుడు తానే స్వయంగా తన బిడ్డ గురించి చెప్పడానికి ముందు వచ్చానని చెప్పారు. మా సంతానం సురక్షిత వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నానని..మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దని ఆష్లీ కోరారు. అయితే దీనిపై ఎలాస్ మస్క్ ఇప్పటి వరకు స్పందించలేదు.
మొత్తం 13 మంది..
మరోవైపు టెస్లా అధినేత మస్క్ కు ఇప్పటికే 12 మంది సంతానం ఉన్నారు. మొదటి భార్య జస్టిన్‌కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తరువాత 2008లో వారిద్దరూ విడిపోయారు. దీని తరువాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ పెళ్ళి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేకపోగా వారి బంధం కనుమరుగైంది. ప్రస్తుతం ఎలాన్ కెనెడియన్ గాయని గ్రిమ్స్ తో కలిసి ఉంటున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరందరూ కాక రీసెంట్ గా తనకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు మస్క్ తానే స్వయంగా ప్రకటించారు. తన ప్రతిష్ఠాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్‌లో పనిచేస్తోన్న ఎగ్జిక్యూటివ్‌తో మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పారు. దీంతో ఆయన పిల్లల సంఖ్య 12 కు చేరుకుంది. ఇప్పుడు ఆష్లీకి పుట్టిన బిడ్డతో కలిపి ఎలాన్ కు 13 మంది పిల్లలు ఉన్నట్లు అయింది.
ఇక ఎలాన్ మస్క్ కు, మొదటి భార్య జస్టిన్ కు పుట్టిన జేవియర్ అలెగ్జాండర్ కొంత కాలం క్రితం అమ్మాయిగా మారారు. తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవియర్ ప్రకటించారు. కుమారుడి చర్యపై కోపంతో ఎలాన్ మస్క్...మొత్తం అమెరికాలోనే ట్రాన్స్ జెండర్స్ కు హక్కులు లేకుండా చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ మీద వత్తిడి తీసుకువచ్చారని సమాచారం. ట్రంప్ ట్రాన్స్ జెండర్ ఫైల్ మీద సంతకం చేయడానికి ఇది కూడా ఒక బలమైన కారణంగా చెబుతారు. మస్క్ తో ఈ గురువారం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీతో భేటీ కాగా..ఈ సమావేశంలో మస్క్ భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉండటం గమనార్హం.
గతంలోనూ మస్క్ పై ఆరోపణలు
స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ పై గతంలో ఆ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నారంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. వాల్ట్ జర్నల్ కథనం ప్రకారం.. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్ చేశారంటూ స్పేస్ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు. 2013లో స్పేస్ఎక్స్ కు రాజీనామా చేసిన మరో మహిళను పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు సదరు మహిళ చెప్పారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. స్పేస్ఎక్స్ లో పని చేస్తున్న ఒక మహిళను మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు ఆప్పట్లో ఆ కథనాలు పేర్కొన్నాయి.






