ఏనుగులు శాకాహారులే.. కానీ ఇప్పుడు మాంసం తింటున్నాయి.. తప్పు మనుషులదే.. ఎందుకంటే..??

by Sujitha Rachapalli |

ఏనుగులు శాకాహారులు. కానీ కేరళలో ఏనుగులు మాంసం తినడం ప్రారంభించాయి. మీరు వింటుంది నిజమే. చికెన్ కర్రీ, ఎగ్ మసాలా, చపాతీ, పరోటా వంటి వండిన ఆహారాలపై ఆసక్తి చూపుతున్నాయి. అడవి సమీపంలో ఉన్న రెస్టారెంట్లు ఆహార వ్యర్థాలను బహిరంగంగా పడేయడం వల్ల

ఏనుగులు శాకాహారులే.. కానీ ఇప్పుడు మాంసం తింటున్నాయి.. తప్పు మనుషులదే.. ఎందుకంటే..??
X

దిశ, వెబ్ డెస్క్: ఏనుగులు శాకాహారులు. కానీ కేరళలో ఏనుగులు మాంసం తినడం ప్రారంభించాయి. మీరు వింటుంది నిజమే. చికెన్ కర్రీ, ఎగ్ మసాలా, చపాతీ, పరోటా వంటి వండిన ఆహారాలపై ఆసక్తి చూపుతున్నాయి. అడవి సమీపంలో ఉన్న రెస్టారెంట్లు ఆహార వ్యర్థాలను బహిరంగంగా పడేయడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఉప్పు రుచికి అలవాటు పడిన వణ్యప్రాణులు ఫాస్ట్ ఫుడ్‌పై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.

పరంబికులం టైగర్ రిజర్వ్‌లోని అల్లిమూప్పన్ గిరిజన సెటిల్‌మెంట్‌కు చెందిన రామన్ ప్రకారం.. ఏనుగులు ఆహార వ్యర్థాల కోసం అడవి సరిహద్దులకు ఆత్రుతగా పరుగెత్తుకుంటూ వస్తున్నాయి. ఈ బహిరంగ డంపింగ్ వాటి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించడమే కాదు మానవ-వన్యప్రాణి సంఘర్షణ ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. కేవలం ఏనుగులు మాత్రమే కాదు, అన్ని వన్యప్రాణులు ఉప్పు రుచి ఉన్న ఆహారంపై ఆసక్తి చూపుతాయి. కాబట్టి అడవి సరిహద్దుల్లో ఆహార వ్యర్థాలను పడేయకుండా నిరోధించేందుకు ప్రచారం చేయాల్సిన అవసరముంది. కోతులు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు ఆహార వ్యర్థాలను తినడం కేరళలో సర్వసాధారణంగా మారుతోంది. ప్యాకేజ్డ్ చిప్స్‌లోని ఉప్పు రుచి వన్యప్రాణులను ఆకర్షిస్తుంది. చిప్స్ తింటున్నప్పుడు, జంతువులు ప్లాస్టిక్ ముక్కలను కూడా తీసుకుంటాయి, ఇవి వాటి జీర్ణ వ్యవస్థలో అడ్డుపడి మరణానికి దారితీస్తాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story